Nara Rohith Wedding: నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్

Nara Rohith Wedding: నారా రోహిత్ మరియు శిరీష లేళ్ల వివాహం అక్టోబర్ 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది. నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు.

Published By: HashtagU Telugu Desk
Nara Rohith And Sireesha We

Nara Rohith And Sireesha We

నారా కుటుంబంలో మరో శుభసందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడు, యువ హీరో నారా రోహిత్ వివాహం సమయం దగ్గరపడింది. ‘ప్రతినిధి 2’ సినిమాలో కలిసి నటించిన శిరీష లేళ్లతో రోహిత్ ప్రేమలో పడి, ఆ ప్రేమను జీవిత బంధంగా మలచబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమ్మతితో వీరి నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. అయితే రోహిత్ తండ్రి నారా రామమూర్తి నాయుడు మృతి కారణంగా వివాహం వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో, ఇద్దరూ జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు.

Gold Rate in India : మళ్లీ తగ్గిన బంగారం ధరలు..ఈరోజు ఎంతంటే !!

తాజా సమాచారం ప్రకారం.. నారా రోహిత్ మరియు శిరీష లేళ్ల వివాహం అక్టోబర్ 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది. నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. నారా కుటుంబానికి చెందిన సభ్యులు, స్నేహితులు, పరిశ్రమ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నారావారి ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది.

వివాహ వేడుకలు అక్టోబర్ 25న హల్దీ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. 26న పెళ్లికొడుకు చేయడం, 28న మెహందీ వేడుక, అనంతరం 30న ప్రధాన వివాహం జరగనుంది. ఇటీవల శిరీష ‘పసుపు దంచడం’ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. నారా రోహిత్ తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణం ప్రారంభించబోతుండగా, అభిమానులు, పరిశ్రమ స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివాహం రాజకీయ, సినీ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

  Last Updated: 23 Oct 2025, 11:33 AM IST