Nara Rohith : హీరో నారా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న మధ్యాహ్నం మరణించారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటూనే మరణించారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు నారా రామ్మూర్తికి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు నారా వారి పల్లెలో జరగనున్నాయి.
ఇక తండ్రి మరణంతో నారా రోహిత్ విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ చిన్నప్పుడు తండ్రితో దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. మీరొక ఫైటర్ నాన్న. మా కోసం ఎన్నో త్యాగాలు చేసారు. మీరు నాకు ప్రేమించడం, జీవితంలో పోరాడటం నేర్పించారు. నేను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం మీరే. ప్రజలను ప్రేమించడంతో పాటు మంచి కోసం పోరాటం చేయాలని చెప్పారు. మీ జీవితం సుఖంగా లేకపోయినా మేము సుఖంగా ఉండటానికి మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. మీతో జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలు మాకు చాలా ఉన్నాయి. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. బై నాన్న అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. దీంతో నారా రోహిత్ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Prabhas Rajasaab : రాజా సాబ్ లో హవా హవా సాంగ్.. థియేటర్ దద్దరిల్లాల్సిందే..!