టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొన్నటి వరకు Most Eligible Bachelor గా ఉన్న హీరోలంతా ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్లు పెళ్లి చేసుకోగా..తాజాగా బాణం ఫేమ్ నారా రోహిత్ (Nara Rohit) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నారా రోహిత్ ..ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు. రోహిత్ చదువంతా కూడా హైదరాబాద్ లోనే సాగింది. చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇండస్ట్రియల్ బయో టెక్నాలజీలో బి.టెక్ చేశారు. ఆ తర్వాత అతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ , న్యూయార్క్ నుండి నటన మరియు లాస్ ఏంజిల్స్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసాడు. 2009న విడుదలైన మొదటిసారి దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బాణం చేసాడు. 2011న పరశురామ్ దర్శకత్వం వహించిన సోలో మంచి గుర్తింపు ను తెచ్చింది. ఆ తర్వాత పలు విజయాలు , అపజయాలు అందుకున్నాడు. ఈ మధ్యనే ప్రతినిధి సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు.
Read Also : Team India New Record: టీమిండియా నయా రికార్డు.. 21 టీ20 మ్యాచ్‌ల్లో 20 విజయం!