నేచురల్ స్టార్ నాని (Natural Star Nani ) తన కెరీర్ ప్రారంభంలో క్లాస్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’ వంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కానీ ఇటీవల నాని తన సినిమాల రూట్‌ను మార్చాడు. ‘ఎంసీఏ’, ‘నేను లోకల్’ వంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు చేసి మాస్ ఆడియన్స్‌లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దసరా’ సినిమాతో మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయినా క్లాస్ ఆడియన్స్‌ను మాత్రం వదలకుండా ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్నాడు.
Minister Ponguleti : ‘‘ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తారా ? తండ్రీకొడుకులది అధికార దాహం’’
తాజాగా నాని నటిస్తున్న ‘హిట్-3’ (HIT 3)సినిమా టోటల్‌గా వయొలెన్స్ ప్రధానంగా ఉంటుందని ట్రైలర్‌తోనే స్పష్టం అయింది. వైజాగ్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాని యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునేవారంతా మే 1న థియేటర్లకు వచ్చేయండి. నాని లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్, ఫన్ చిత్రాలు చేయాలని అనుకునేవారు మాత్రం ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాని అన్ని రకాల చిత్రాల్లో నటించాలని కోరుకునేవాళ్లు మా చిత్రాన్ని ఎంజాయ్ చేయండి’’ అ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విన్న అభిమానులంతా నవ్వుకున్నారు.