Site icon HashtagU Telugu

Nani’s Movie:నాని ‘దసరా’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

Dussehra

Dussehra

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపించడానికి ట్రై చేసే హీరోల్లో నాని ముందువరుసలో ఉంటాడు. ఆయన తాజా చిత్రంగా ‘దసరా’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన ఈ స్థాయి లుక్ తో కనిపించనుండటం ఇదే మొదటిసారి.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. సిల్క్ స్మిత బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఉన్న గోడకి ఆనుకుని అరుగుపై కూర్చున్న నాని కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ చూస్తుంటే కథ ఏ కాలంలో జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ‘నేను లోకల్’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.