Nani Dasara: నాని ‘దసరా’ సినిమా టీజర్ రెడీ

'దసరా' మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Published By: HashtagU Telugu Desk
Nani Dasara

Nani Dasara

నాని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివీల్ చేయడం ఆసక్తికరంగా ఉంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా వర్క్ చేస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

  Last Updated: 26 Jan 2023, 05:00 PM IST