Site icon HashtagU Telugu

Nani : నాని జోరు బాగుందిగా.. ఓజీ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..!

Nani32 Movie Announcement Sujith Direction

Nani32 Movie Announcement Sujith Direction

న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డివివ్ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమా కూడా బ్యానర్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి నాని ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. రన్ రాజా రన్, సాహో రెండు సినిమాలతో తన టేకింగ్ రేంజ్ ఏంటో చూపించిన సుజిత్ ఓజీ తర్వాత నానితో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు.

నాని సరిపోదా శనివార్ ఆగష్టు ఎండింగ్ కి రిలీజ్ లాక్ చేశారు. అది పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పొచ్చు. నాని సరిపోదా శనివారం టీజర్ కూడా రీసెంట్ గా రిలీజైంది. శనివారం మాత్రం కోపం వచ్చి గొడవపడే హీరో పాత్రలో నాని కనిపిస్తున్నారు.

సుజిత్ డైరెక్షన్ లో మూవీకి కూడా ఒక ఇంట్రెస్ట్ వీడియో రిలీజ్ చేశారు. అది కూడా ఈ కాంబో మీద అంచనాలను రెట్టింపు చేస్తుంది. మొత్తానికి నాని లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడని చెప్పొచ్చు.