Site icon HashtagU Telugu

Nani Yellama : నాని ఎల్లమ్మ ఆగిపోవడం వెనుక కారణాలు అవేనా..?

Nani Yellama Shelved due to Budget Issues

Nani Yellama Shelved due to Budget Issues

Nani Yellama న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమాను లాక్ చేసుకున్నాడు. సరిపోదా శనివారం నిర్మిస్తున్న డివివి దానయ్య నిర్మాణంలోనే ఈ సినిమా కూడా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాతో పాటుగా బలగం వేణు డైరెక్షన్ లో సినిమా కూడా నాని చేస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే నాని వేణు సినిమా ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు.

బలగం సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన వేణు తన నెక్స్ట్ సినిమా నాని హీరోగా చేయాలని అనుకున్నాడు. ఎల్లమ్మ అంటూ ఒక టైటిల్ కూడా అనుకున్నాడు. ఐతే ఈ సినిమాకు వేణు ఎక్కువ బడ్జెట్ అడగడం వల్ల నిర్మాత దిల్ రాజు ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. నాని మీద ఎక్కువ బడ్జెట్ పెట్టినా వర్క్ అవుట్ అవుతుంది కానీ వేణు మీద నమ్మకంతో పెట్టేందుకు దిల్ రాజు రెడీగా లేడని చెప్పుకుంటున్నారు.

అలా నాని ఎల్లమ్మ సినిమా కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత నాని నెక్స్ట్ సినిమా విషయం ఒక క్లారిటీకి వస్తుంది. నాని మాత్రం తన సినిమాల విషయంలో వెనక్కి తగ్గేదిలేదు అన్నట్టుగా ఉన్నాడు.

Also Read : Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ వచ్చేసింది.. హరీష్ శంకర్ అదరగొట్టేసాడుగా..