Nani : కొడుకుతో కలిసి జెర్సీ స్పెషల్ షో చూసిన నాని.. స్క్రీన్ పై తండ్రిని చూస్తూ..

కొడుకుతో కలిసి జెర్సీ స్పెషల్ షో చూసిన నాని. థియేటర్ లో స్క్రీన్ పై తండ్రిని చూస్తూ అర్జున్..

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 08:27 PM IST

Nani : నేచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘జెర్సీ’ ఈ సంవత్సరంతో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఓ స్పెషల్ షోని నిర్వహించారు. ఈ షో చూడడానికి అభిమానులతో పాటు నాని తన కొడుకు అర్జున్ తో కలిసి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలోని జనాలను చూస్తుంటే.. అది స్పెషల్ షోలా కనిపించడం లేదు. రిలీజ్ సమయంలో ఎలాంటి జనసంద్రోహం కనిపిస్తుందో, ఈరోజు కూడా అలాంటి జనసంద్రోహం థియేటర్ వద్ద కనిపించింది. జెర్సీ సినిమాకి నాని ఫ్యాన్స్ లోనే కాదు టోటల్ టాలీవుడ్ ఆడియన్స్ లో కల్ట్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వలనే నేడు థియేటర్ వద్ద అంతమంది ఆడియన్స్ కనిపించారు.

ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోల్లో నెటిజెన్స్ బాగా ఆకట్టుకున్నది ఏంటంటే.. నాని కొడుకు అర్జున్ కి సంబంధించింది. స్క్రీన్ పై తన తండ్రి వస్తుంటే.. అర్జున్ ఆసక్తితో నిలబడి మరి చూస్తుండడం నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరి ఆ వీడియోలు పై మీరు ఓ లుక్ వేసేయండి.

ఇది ఇలా ఉంటే, ఈ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్జున్.. తన తండ్రి నానికి, అలాగే జెర్సీ ఫ్యాన్స్ కి ఒక బహుబాతి ఇచ్చారు. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్న అర్జున్.. జెర్సీ థీమ్ మ్యూజిక్ ని పియానో పై ప్లే చేసి మెస్మరైజ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోని నాని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.