Site icon HashtagU Telugu

The Paradise Glimpse : నాని ‘ది పారడైజ్’ గ్లింప్స్ వచ్చేసింది.. కడుపు మండిన కాకుల కథ..

Nani The Paradise Movie Glimpse Released

The Parasize

The Paradise Glimpse : నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇటీవల ‘ది పారడైజ్’ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నాని – శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా పెద్ద హిట్ అయి 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. దీంతో ఈ కాంబో మళ్ళీ వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.

దసరాలో మొదటి సారి నాని పూర్తి మాస్ చూపించాడు. ఈ పారడైజ్ సినిమాలో మరింత మాస్, మరింత వైలెన్స్ ఉండబోతుంది అని తెలుస్తుంది. తాజాగా నేడు ది పారడైజ్ రా స్టేట్మెంట్ అంటూ ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా గ్లింప్స్ చూసేయండి..

ఈ గ్లింప్స్ చూస్తుంటే అంతమవుతున్న ఓ జాతి కథ అని, ఆ జాతికి నాని పాత్ర లీడర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నాని రెండు జళ్లతో కొత్తగా మరింత వైలెంట్ గా కనపడబోతున్నట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ అంతా నాని అమ్మ పాత్ర వాయిస్ తో తెలంగాణ స్లాంగ్ లో సాగింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక నాని త్వరలో హిట్ 3 సినిమాతో రానున్నాడు. ఆ తర్వాత ది పారడైజ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం పారడైజ్ షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పారడైజ్ తర్వాత నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడు.

Also Read : Chhaava : సూపర్ హిట్ సినిమా ‘చావా’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. తప్పక చూడాల్సిన సినిమా..