Site icon HashtagU Telugu

Vote For Pawan Kalyan : నానికి ఉన్న ధైర్యం మీకు లేకపాయే ..ఛీ

Nani Support Pawan

Nani Support Pawan

చిత్రసీమ నుండి ఒకరు రాజకీయాల్లోకి వచ్చారు..అది కూడా సామాన్య హీరోకాదు..రోజుకు రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్లు తీసుకునే సత్తాగల హీరో..ఎవరు ఏ ఆపద లో ఉన్న..నేనున్నానంటూ ముందుకు వచ్చి సాయం చేసే గొప్ప మనసు ఉన్న వ్యక్తి..అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాల్సింది పోయి..తమ స్వార్థం కోసం..సపోర్ట్ చేస్తే ఏమవుతుందో..? ఎక్కడ మన సినిమాలు అడ్డుకుంటారో..? ఏ ఇబ్బంది వస్తుందో అని భయపడుతూ నోరు విప్పకుండా సైలెంట్ గా ఉన్న చిత్రసీమ ప్రముఖులను చూసి ఇప్పుడు యావత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఛీ కొడుతున్నారు. నాని లాంటి చిన్న ఈరోజు ఆ వ్యక్తి కి సపోర్ట్ చేసి నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఇప్పడాటికే మీకు అర్థమై పోయింటుంది. అవును మన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించే మీము చెపుతుంది.

ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో రోమాలు నిక్కబొడుస్తాయి. అందరి హీరోలకు అభిమానులు ఉంటె..ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజల కోసం ..తన బంగారు జీవితాన్ని పక్కన పెట్టి ఎండనక వాననకా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. తనగోటికి కూడా పనికిరాని వారి చేత నానా మాటలు అనిపించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి చెందినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా రాజకీయాల్లో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలనీ తపిస్తూ గత పదేళ్లుగా కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి అందరు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా చిత్రసీమ.

చిత్రసీమలో ఎంతోమంది ఉన్నారు..మెగా ఫ్యామిలీ వల్ల ఎన్నో లాభాలు పొందినవారు ఉన్నారు. అలాంటి వారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా సైలెంట్ ఉండడం ఫై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా తోటి కళాకారుడికి సపోర్ట్ చేయని మీరు ఓ కళాకారులేనా..? అని యావత్ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఓ చిన్న నటుడు తన సినీ కెరియర్ కు ఏమైనా పర్వాలేదు అని చెప్పి ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటూ పోస్ట్ పెడితే..అతడ్ని చూసి కూడా మీరు ధైర్యం చేయలేకపోతున్నారు..ఛీ అంటున్నారు. చిన్న , చిన్న నటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఈరోజు పవన్ కోసం ప్రచారం చేస్తుంటే..మీరు ఏసీ గదుల్లో ఉంటూ ఓ చిన్న ట్వీట్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే..మీకున్న పిరికిపందల ఎవ్వరు లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని పవన్ కు సపోర్ట్ చెయ్యండి..అని కోరుతున్నారు. చూద్దాం మరి ఎంత మంది బయటకు వస్తారో..? పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తారో..!!

Exit mobile version