న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నానినే నిర్మాత కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారట. సినిమా కోసం భారీ యాక్షన్ ఘట్టాలు షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేస్తున్నాడు. పారడైస్ (Paradise) టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమాతో పాటుగా సుజిత్ (Sujith) డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుందని తెలిసిందే. Multistarrer డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో మొదలు కాబోతుంది. ఐతే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా ఉండే ఛాన్స్ ఉందట. నాని పాత్రకు ఈక్వల్ గా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండట. సినిమాకు అది కూడా కీలకం కాబట్టి ఆ రోల్ లో మరో హీరోని పెట్టాలని చూస్తున్నారట.
నానితో స్క్రీన్ షేరింగ్..
సో నానితో స్క్రీన్ షేరింగ్ అంటే కచ్చితంగా మరో హీరోకి కూడా మంచి ఛాన్స్ అన్నట్టే లెక్క. దసరా లో దీక్షిత్, సరిపోదా శనివారంలో ఎస్.జె సూర్య ఇలా తన ప్రతి సినిమాలో తనతో పాటు మరొకరికి ఇంపాక్ట్ ఉన్న రోల్ వచ్చినా ఓకే అనేస్తున్నాడు నాని. అందుకే సుజిత్ సినిమాలో మరో హీరో అనగానే ఓకే అనేశాడట. ఇంతకీ నానితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ హీరో ఎవరన్నది చూడాలి.
ఓజీ సినిమా పూర్తి కాగానే నాని సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారని తెలుస్తుంది.
Also Read : Ameesha Patel : డార్లింగ్ తో సాయంత్రం.. బద్రి హీరోయిన్ డేటింగ్ సీక్రెట్ రివీల్..!