Site icon HashtagU Telugu

Nani : నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట.. మరో నిర్మాత చేతిలోకి..

Nani Sujeeth Movie Rights Will Be Transfer From Dvv To Another Production House

Nani Sujeeth Movie Rights Will Be Transfer From Dvv To Another Production House

Nani : నానితో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా నిర్మిస్తున్న డివివి దానయ్య.. ఈ హీరోతో మరో సినిమాకి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం అగ్రిమెంట్ మాత్రమే కాదు, కథని ఎంపిక చేయడం, దర్శకుడితో ఆ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం డివివి నిర్మాణంలోనే పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ సినిమా చేస్తున్న సుజిత్ దర్శకత్వంలో నాని సినిమాని తెరకెక్కించడానికి డివివి ప్లాన్ వేశారు.

నాని పుట్టినరోజు నాడు ఈ మూవీని కాన్సెప్ట్ టీజర్ తో అనౌన్స్ చేసారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఆ సినిమా కథ ఉండబోతుంది. ఈ స్టైల్ ఆఫ్ స్టోరీలో నాని ఇప్పటి వరకు నటించలేదు. దీంతో ఈ మూవీ పై నాని అభిమానులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఓ న్యూస్.. నాని అభిమానులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ కారణాలు వల్ల నిర్మాత డివివి.. ఈ ప్రాజెక్ట్ ని నిలిపివేశారంటూ ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ వార్తతో నాని అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా ఆగిపోవడం లేదంట, మరో నిర్మాత చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్తుందట. డివివి ఈ ప్రాజెక్ట్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన ఓ నిర్మాణ సంస్థ.. ఆ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందట. ఆ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని గట్టిగా వినిపిస్తుంది.

కాగా నాని అభిమానులు ఈ వార్త నిజమైతే బాగుండని ఆశ పడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ని డివివి సంస్థ.. మరి ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చి నాని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందా..? లేదా ఆ ప్రాజెక్ట్ లోకి మరో హీరోని తీసుకు వస్తుందా..? అనేది చూడాలి.