న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కలిసి దసరా సినిమా చేశారు. తొలి సినిమాతోనే తన డైరెక్షన్ టాలెంట్ చూపించి అదరగొట్టాడు శ్రీకాంత్ ఓదెల. నాని కూడా బోయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని పక్కన పెట్టి దసరా కోసం డేర్ స్టెప్ వేశాడు. దసరా తర్వాత నాని హాయ్ నాన్న, సరిపోదా శనివారం రెండు హిట్ సినిమాలు అందించాడు. ఐతే దసరా తర్వాత నాని మరోసారి శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెల ఈసారి నాని కోసం నెక్స్ట్ లెవెల్ స్టోరీ సిద్ధం చేశాడని తెలుస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల సినిమా ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని టాక్. ఐతే నాని శ్రీకాంత్ ఓదెల కాంబో సినిమాకు టైటిల్ గా నాయుడి గారి తాలూఖా (Nayudigari Talukha) అని పెట్టే ఆలోచనలో ఉన్నారట.
నాని, శ్రీకాంత్ జాగ్రత్త పడుతున్నారు..
నాని (Nani,) మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటూనే దసరా లానే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా నాయుడి గారి తాలూఖా ఉంటుందని తెలుస్తుంది. టైటిల్ ఐతే అదిరిపోయింది. సినిమా విషయంలో నాని, శ్రీకాంత్ (Srikanth Odela) ఇద్దరు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి డీటైల్స్ తెలియాల్సి ఉంది.
ఐతే నాని, శ్రీకాంత్ కలయిక కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిరుద్ ఈ సినిమాకు సైన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి. దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిరుద్ ఈ సినిమాకు సైన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి.
Also Read : Anushka : అనుష్క ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!