Site icon HashtagU Telugu

Nani Srikanth Odela : నాని దసరా కాంబో షాక్ అయ్యే బడ్జెట్..!

Nani Paradise two Parts planning

Nani Paradise two Parts planning

Nani Srikanth Odela న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగష్టు మంత్ ఎండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేశాడు. సుజిత్ తో పాటుగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో కూడా నాని తన సినిమా చేస్తాడని తెలుస్తుంది. దసరా తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల ఈసారి నానిని మరో డిఫరెంట్ యాంగిల్ లో చూపించి మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఐతే నాని శ్రీకాంత్ ఓదెల సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బడ్జెట్ నాని మార్కెట్ కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. దసరా తో 100 కోట్లు కలెక్ట్ చేసిన నాని ఈ సినిమాను అంతకు మించి రాబట్టే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నరట. ఇదివరకు ఎప్పుడు నాని సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ కోట్ చేయలేదని టాక్.

నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే టాక్ ఉంది. ఐతే నాని కూడా ఇక మీదట తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు భారీ బడ్జెట్ అవసరం ఉండగా నాని కోసం దసరా నిర్మాత ముందుకు వచ్చాడని తెలుస్తుంది. మరో పక్క సుజిత్ సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్ వల్ల వెనకపడిందని టాక్. నాని బలగం వేణు చేయాల్సిన ఎల్లమ్మ సినిమాకు బడ్జెట్ సమస్యలతోనే ఆగిపోయిందని కూడా చెప్పుకుంటున్నారు.

Also Read : Surya : సూర్య ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.. ఎందుకంటే..?