Site icon HashtagU Telugu

Nani: నానికి బంపరాఫర్, రజనీ మూవీలో ప్రత్యేక పాత్ర ఆఫర్!

Rajani

Rajani

Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం నటుడిని సంప్రదించినట్లు తాజా అప్‌డేట్. జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పేరు పెట్టని ఈ చిత్రంలో నాని అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

నాని కోసం ఓ లైన్ వినిపించారని, కథ ఆకట్టుకోవడంతో ఒకే చెప్పాడని తెలుస్తోంది. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రజనీకాంత్ రాబోయే చిత్రం జైలర్ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మరియు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ షూటింగ్‌లో ఉన్నారు.

నాని ఇటీవలనే హాయ్ నాన్న మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, తీగల విజయేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తండ్రి-కూతురు ఎమోషనల్ బాండింగ్ తో వస్తున్న ఈ సినిమాను.. డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!