టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే. నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు నాని. ఇది ఇలా ఉంటే తాజాగా నాని తన పుట్టినరోజును కాస్త స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
తన పుట్టినరోజుకి వరుస సినిమాల అప్డేట్స్ ఇచ్చి అభిమానులకు తానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఫుల్ ఖుషీ చేశారు. అయితే నాని తన అభిమానులను ఖుషీ చేస్తే తన వారసుడు అర్జున్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి నానినే ఖుషీ చేశాడు. ఈ పుట్టినరోజుని నాని తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను నాని వైఫ్ అంజలి అభిమానులతో పంచుకున్నారు. వాటిలో అర్జున్ కి సంబంధించిన ఓ వీడియో అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. ఆ వీడియోలో అర్జున్ ఇలా మాట్లాడాడు.. నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్ డేకి గిఫ్ట్ గా నేను ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను అంటూ చెప్పి పియానో పై మ్యూజిక్ ప్లే చేశాడు.
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజెన్స్ మాత్రమే కాదు.. కీర్తి సురేష్, ఆదా శర్మ వంటి సెలబ్రిటీస్ సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే నాని కొడుకు అర్జున్ ని ప్లే చేసిన సాంగ్ నాని నటించిన సినిమాలలో ఒక ఎమోషనల్ సాంగ్ కావడం విశేషం. అయితే వీడియో ఎక్కువ లెంత్ లేకపోయినప్పటికీ ఆ కొద్దిపాటి వీడియో నాని అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.