Site icon HashtagU Telugu

Nani : ఆ డైరెక్టర్ తో చేయాలని ఉందన్న నాని..!

Nani Srikanth Odela movie title

Nani Srikanth Odela movie title

Nani న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిజల్ట్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాని. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన ఫ్యాన్స్ తో ఎక్స్ లో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నేటి యువ దర్శకులలో నాని ఎవరి డైరెక్షన్ లో చేయాలని అనుకుంటునారని అడగ్గా.. నాని బలగం వేణు పేరు చెప్పాడు. నాని వేణు పేరు చెబుతాడని ఎవరు ఊహించలేదు.

జబర్దస్త్ కమెడియన్ గా మెప్పించిన వేణు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కమెడియన్ గా చేస్తూ వచ్చాడు. వేణు డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమానే బలగం లాంటి బంపర్ హిట్ అవ్వడంతో అతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. వేణు ప్రతిభ మెచ్చిన చాలా మంది హీరోలు అతనితో సినిమాకు రెడీ అవుతున్నారు.

వేణు మంచి కథతో వస్తే సినిమా చేసేందుకు హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా వేణుతో తను సినిమా చేయాలని అనుకుంటున్నానని తన ఇంట్రెస్ట్ తెలిపారు నాని. ఈ కాంబో సినిమా ఓకే అయితే మాత్రం అటు వేణుకి ఇటు నానికి మంచి సినిమా పడే ఛాన్స్ ఉంది.

Also Read : Dhootha: యానిమల్ ఊచకోత.. దుమ్ముదులుపుతోన్న దూత.. 24 గంటల్లో నంబర్ వన్

We’re now on WhatsApp : Click to Join