Site icon HashtagU Telugu

SJ Surya : ఆ విలన్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు ఉన్నారే..!

Nani Saripoda Shanivaram Sj Surya Glimpse

Nani Saripoda Shanivaram Sj Surya Glimpse

నాని సినిమా కథలే కాదు కాస్టింగ్ కూడా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సినిమాలతో హిట్లు అందుకున్న నాని (Naturalstar Nani) లేటెస్ట్ గా సరిపోదా శనివారం అంటూ వస్తున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో నానితో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నానితో ఆల్రెడీ అమ్మడు గ్యాంగ్ లీడర్ సినిమా చేసింది. సినిమాలో విలన్ గా ఎస్.జె సూర్య నటిస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) తో స్పైడర్ సినిమా చేశాక సూర్య నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. కోలీవుడ్ లో విలన్న్ గా దూసుకెళ్తున్న సూర్య (SJ Surya) ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన పాగా వేయాలని చూస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్ కాగా అందులో ఎస్.జె సూర్య రోల్ రివీల్ చేశారు. ఆయన ఒక రూడ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. సినిమాలో సూర్య ఎనర్జీని ఫుల్లుగా వాడేసినట్టు అర్ధమవుతుంది.

నాని సినిమాలో తన పాత్రతో పాటుగా సినిమాకు బలం ఉన్న మరో పాత్ర కూడా హైలెట్ అవుతుంది. దసరా సినిమాలో తన ఫ్రెండ్ గా చేసిన నటుడికి సమానా ప్రాధాన్యత ఉంటుంది. హాయ్ నాన్న లో కూడా నానికి ఈక్వల్ గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ది ఉంటుంది. ఇప్పుడు సరిపోద శనివారం సినిమాలో కూడా ఎస్.జె సూర్యకు అదే తరహా ఈక్వల్ రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది.

అంటే సుందరానికీ సినిమాతో వివేక్ లోని టాలెంట్ గుర్తించిన నాని సరిపోదా శనివారం (Nani Saripoda Shanivaram) తో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ లాక్ చేశారు. ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ కూడా సినిమాపై మంచి బజ్ పెంచాయి. నాని మార్క్ హిట్ కొట్టేలా సరిపోదా శనివారం వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా బడ్జెట్ ఇష్యూ వల్ల లేట్ అవుతుందని తెలుస్తుంది. సుజిత్ కూడా పవర్ స్టార్ తో చేస్తున్న ఓజీ రిలీజ్ తర్వాతే నాని సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.