న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియంకా మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే సినిమా రిలీజ్ ఈరోజే అయినా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడటంతో ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. నాని సరిపోదా శనివారం సినిమా కథ యూనిక్ పాయింటే అయినా కథనం కాస్త రొటీన్ గా అనిపించిందని అంటున్నారు.
ఐతే నాని మాస్ యాక్టింగ్, విలన్ గా ఎస్ జే సూర్య నటన సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయని అంటున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని.. బిజిఎం అదరగొట్టాడని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త అలా అలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుందని. సినిమా మళ్లీ క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు.
ఐతే ఓవరాల్ గా సరిపోదా శనివారం (Saripoda Shanivaram) సినిమాకు హిట్ టాక్ వచ్చింది. నాని మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ బాగున్నా సినిమాలో కొన్ని ఫ్లాట్ గా ఆడియన్స్ గెస్ చేసేలా ఉందని అంటున్నారు. ఐతే ఓవరాల్ గా అయితే సినిమా నాని ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ అందిస్తుందని అంటున్నారు.
నాని (Nani,) ప్రియాంక లవ్ స్టోరీ కూడా రొటీన్ గానే ఉంటుందని చెబుతున్నారు. యూఎస్ లో ప్రీమియర్స్ నుంచి వన్ టైం వాచబుల్ రిపోర్ట్ రాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి.
Also Read : Balakrishna : పుష్ప రాజ్ తో ఢీ కొడుతున్న బాలయ్య..?