Nani Saripoda Shanivaram న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కొంతమంది ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేస్తున్నాడు. సరిపోదా శనివారం అంటూ ఒక కొత్త కథఓ వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు నాని.
ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేసినట్టు అనిపిస్తుంది. ఈ నెల చివరన అంటే 29న రిలీజ్ అవుతున్న సరిపోదా శనివారం సినిమా మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సినిమా కోసం ఒక కొత్త ఊరుని క్రియేట్ చేశాడు వివేక్ ఆత్రేయ.
Also Read : Keerti Suresh : కీర్తి సురేష్ ఇంటికెళ్లి మరి పెళ్లి ప్రపోజల్ చేశాడట..!
సరిపోదా శనివారం సినిమా లో ఎస్ జే సూర్య (SJ Surya) విలన్ గా నటిస్తున్నాడు. సినిమా నుంచి రిలీజైన టీజర్ లో ఆయన రోల్ అదిరిపోతుందని అనిపిస్తుంది. సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించింది. నాని తో ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన అమ్మడు మళ్లీ ఈ సినిమాలో జత కట్టింది.
లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్లు అందుకున్న నాని సరిపోదా శనివారం సినిమాతో కూడా మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. సినిమాల కథల విషయంలో నాని క్లారిటీ చూస్తే వావ్ అనక తప్పదు. ఏ సినిమా ప్రేక్షకుడిని అలరిస్తుందని జడ్జ్మెంట్ ముందే గెస్ చేస్తాడు కాబట్టే నాని కెరీర్ ఇంత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. రిపోదా శనివారం సినిమా ప్రచార చిత్రాలన్నీ చూస్తే మరో హిట్ నాని ఖాతాలో పడేందుకు రెడీ అని ఫిక్స్ అవ్వొచ్చు.