Site icon HashtagU Telugu

Nani Saripoda Shanivaram : సరిపోదా శనివారం అతన్ని చూడాలని ఉందా.. ఐతే ఆరోజు దాకా ఆగండి..!

Nani Saripoda Shanivaram Fist Look Teaser Saturday Announcement

Nani Saripoda Shanivaram Fist Look Teaser Saturday Announcement

Nani Saripoda Shanivaram న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా నుంచి క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ శనివారం అంటే 24 న ఉదయం 11:59 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అతన్ని చూడాలని అనుకుంటున్నారా అయితే 24 మధ్యాహ్నం 11 గంటల 59 నిమిషాల వరకు వెయిట్ చేయండి అని ప్రకటించారు.

నాని వివేక్ ఆత్రేయ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించింది కానీ చాలామంది ఆడియన్స్ ని మెప్పించింది. ఇక ఈ ఇద్దరు కలిసి రెండో ప్రయత్నంగా చేసిన సరిపోదా శనివారం సినిమా సరికొత్త కథ కథాంశంతో వస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని ఈ శనివారం రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచిఏలా చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. ఆ డేట్ న పుష్ప 2 రిలీజ్ అనౌన్స్ చేశారు. ఒకవేళ పుష్ప వచ్చినా సరిపోదా శనివారం వస్తుందా లేదా అది వాయిదా పడితే ఈ సినిమా వస్తుందా అన్నది చూడాలి.