Saripoda Shanivara Collections న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన సరిపోదా శనివారం గురువారం రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని నుంచి వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. లెంగ్త్ ఒక్కటి కాస్త ఎక్కువ ఉందని టాక్ వచ్చినా సినిమా మాత్రం అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాక్ బాగుండటంతో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. ఫస్ట్ డే 24 కోట్ల పైన దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన సరిపోదా శనివారం శుక్రవారం అంటే సెకండ్ డే కూడా అదే రేంజ్ వసూళ్లు సాధించిందని అంటున్నారు.
సరిపోదా శనివారం (Saripoda Shanivaram) ఓవర్సీస్ లో క్రేజీ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ప్రీ సేల్స్, ఫస్ట్ డే తో కలిపి 1.1 మిల్యన్ వసూళ్లను రాబట్టింది. నాని సరిపోదా శన్వీఅరం తో మరోసారి మిలియన్ మార్క్ దాటేశాడు. వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ సినిమాను తీసిన నాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా అతని మీద నమ్మకంతో ఈ మూవీ ఛాన్స్ ఇచ్చాడు.
సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ స్టార్ ఎస్ జే సూర్య విలన్ గా నటించారు. జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టేసింది. నాని (Nani) లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్నతో సూపర్ సక్సెస్ అందుకోగా ఇప్పుడు సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ డేనే పాతిక కోట్లు అంటే లాంగ్ రన్ లో ఈ సినిమాతో కూడా నాని 100 కోట్లు రీచ్ అవుతాడేమో చూడాలి.