Site icon HashtagU Telugu

Nani : నాని సినిమా రెమ్యునరేషన్ వల్లే ఆగిపోయిందా..?

Nani Shocking Comments on Eega 2

Nani Shocking Comments on Eega 2

Nani న్యాచురల్ స్టార్ నాని కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న నాని త్వరలో సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాని మరోసారి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఐతే నాని ఈ సినిమాతో పాటుగా చేయాల్సిన మరో రెండు సినిమాలు దాదాపు ఆగిపోయినట్టే అని చెబుతున్నారు. అందులో ఒకటి నాని సుజిత్ కాంబో సినిమాలో అనుకున్న ప్రాజెక్ట్ కాగా.. మరొకటి బలగం (Balagam) వేణు డైరెక్షన్ లో నాని చేయాల్సిన సినిమా అని తెలుస్తుంది. నాని హీరోగా ఓజీ సుజి డైరెక్షన్ లో ఒక సినిమా లాక్ చేశారు. సుజిత్ తో నాని సినిమాను కూడా డివివి దానయ్య నిర్మించాలని అనుకున్నారు. ఐతే ఆ సినిమాకు నాని ఎక్కువ రెమ్యునరేషన్ అడగడం వల్ల సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది.

Also Read : Anushka : దేవసేన ఫోటో పోస్ట్ చేసిన అనుష్క.. ప్రభాస్ తో జత కడుతుందా..?

మరోపక దిల్ రాజు నిర్మాణంలో నాని, వేణు కాంబోలో రావాల్సిన ఎల్లెమ్మ సినిమాకు కూడా నాని రెమ్యునరేషన్ (Remuneration) ని ఒక రేంజ్ లో అడిగినట్టు తెలుస్తుంది. అందుకే దిల్ రాజు నాని అడిగినంత ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. వేణు ఎల్లమ్మలో మరో హీరో కోసం వెతుకుతున్నారని టాక్. ఐతే ఇలా తన దగ్గరకు వచ్చిన మంచి కథలను రెమ్యునరేషన్ కోసం వదిలేయడం నాని కెరీర్ కు ఏమాత్రం మంచిది కాదని చెప్పొచ్చు.

ఐతే వరుస హిట్లతో టైర్ 2 హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరోగా మారిన నాని తన సొంత బ్రాండ్ ను ఏర్పరచుకునే పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే నాని రెమ్యునరేషన్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదని అర్ధమవుతుంది.

Exit mobile version