Site icon HashtagU Telugu

Nani : బలగంపై ప్రేమ.. నాని ఎల్లమ్మ పరిస్థితి ఏంటి..?

Nani Srikanth Odela movie title

Nani Srikanth Odela movie title

న్యాచురల్ స్టార్ నాని ఈమధ్యనే ప్రియదర్శి డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లాడు. ఆ ఈవెంట్ లో బలగం సినిమా (Balagam Movie) ప్రస్తావన తెచ్చి ఈ దశాబ్ధంలో తనకు బాగా నచ్చిన సినిమా అదేనని మరోసారి గుర్తు చేశారు. నాని ఈ మాట ఎప్పటినుంచో చెబుతున్నాడు. బలగం డైరెక్టర్ వేణుతో నాని ఒక సినిమా కూడా ప్లాన్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా ఎల్లమ్మ టైటిల్ తో ఆ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది.

నాని (Natural Star Nani) ఆ సినిమాకు బదులుగా వేరే రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. వేణు తో నాని చేయాల్సిన ఎల్లమ్మ (Yellamma) సినిమా కేవలం బడ్జెట్ ఇష్యూస్ వల్లే ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఐతే స్టేజ్ మీద నాని ఇలా బలగం సినిమా గురించి గొప్పగా చెబుతూ ఆ డైరెక్టర్ తో చేయాల్సిన సినిమా చేయకపోవడం ఏంటని ఆడియన్స్ అడుగుతున్నారు.

నాని దసరా కాంబోలో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ సినిమాను దసరాను మించిన సినిమాగా చేయాలని ప్లాన్. అందుకే ఆ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని తీసుకుంటున్నారట. అదే కాకుండా సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా క్రేజీ మూవీగా రాబోతుంది.

సో ఈ సినిమాలతో పాటు నాని వేణు (Venu)తో చేయాల్సిన ఎల్లమ్మ కూడా చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఐతే నాని ఎల్లమ్మ పూర్తిగా అటకెక్కిందా లేదా కొన్నాళ్లు వెయిట్ చేశాక తీసే ఆలోచన ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నానితో బలగం డైరెక్టర్ సినిమా చూడాలని అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. నాని త్వరలో సరిపోదా శనివారంతో రాబోతున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.