Nani న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న టీజర్ రిలీజ్ సందర్భంగా ఏర్పరచిన ప్రెస్ మీట్ లో తాను మల్టీస్టారర్స్ కి రెడీ అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ ఎప్పుడు అని మీడియా నుంచి నానికి ప్రశ్న రాగా విజయ్ కెరీర్ స్టార్ట్ చేసిందే మల్టీస్టారర్ తో.. తనని ఎప్పుడు కలిసినా మళ్లీ ఆన్ స్క్రీన్ కలిసి చేద్దామని డిస్కస్ చేస్తామని అన్నారు నాని. విజయ్ (Vijay Devarakonda) తో కలిసి నటించేందుకు తాను ఎప్పుడు రెడీ అన్నారు నాని.
ఇక తన సినిమాలకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ సక్సెస్ అవ్వట్లేదు అన్న మీడియా పర్సన్ కామెంట్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నాని. జెర్సీ (Jersey), శ్యాం సింగ రాయ్ (Shyam Singha Roy) ప్రాఫిట్స్ వచ్చాయని ఒక సినిమా బిజినెస్ విషయంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయని అవి తెలియకుండా సినిమా లాస్ అని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు నాని.
తన నిర్మాతలు తన సినిమాల వల్ల చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. నాని (Nani) ప్రెస్ మీట్ తర్వాత జెర్సీ, శ్యాం సింగ రాయ్ నిర్మాతలు కూడా నానికి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో మెసేజ్ లు పెట్టారు. సో ప్రెస్ మీట్ లో హీరోలను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మీడియాకు నిర్మాతల నుంచి కూడా షాక్ తగిలినట్టే అని చెప్పొచ్చు.
నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో వస్తున్నారు. శౌర్యువ్ (Shouryuv) అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా లో నాని మృణాల్ ఠాకూర్ తో జత కట్టారు. సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు.
Also Read : Bigg Boss 7 : సోషల్ మీడియాలో 6 లక్షల ఫాలోవర్స్.. వారానికే ఇంటికెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!