Site icon HashtagU Telugu

Natural Star Nani : టైర్ 1 కి సరిపోయే కంటెంట్..!

Nani Promoting To Tier 1 Hero With Saripoda Shanivaram

Nani Promoting To Tier 1 Hero With Saripoda Shanivaram

Natural Star Nani న్యాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా అదరగొడుతుంది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో సక్సెస్ అందుకున్న నాని లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తున్నారు.

ఈ నెల 29న రిలీజ్ అవుతుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాని నుంచి వస్తున్న మాస్ మూవీగా సరిపోదా శనివారం (Saripoda Shanivaram) అనిపిస్తుంది. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకునేలా మాస్ స్టఫ్ తో ఇది వస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో నాని టైర్ 2 నుంచి టైర్ 1కి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉండేలా అనిపిస్తుంది.

సినిమా ట్రైలర్ తోనే ఆసక్తి కలిగించేలా చేసిన నాని సినిమా తో తప్పకుండా తన ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ చూపించబోతున్నాడని అనిపిస్తుంది. వివేక్ ఆత్రేయ కూడా ఇన్నాళ్లు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ ఈసారి నానితో అదిరిపోయే రేంజ్ లో మాస్ మూవీతో వస్తున్నాడు. సినిమా ట్రైలర్ చూస్తేనే హిట్ వైబ్ రాగా సినిమా కూడా కచ్చితంగా అదే రేంజ్ లో ఉండేలా ఉంటుందనిపిస్తుంది.

ఇన్నాళ్లు నాని టైర్ 2 హీరో మాత్రమే అనుకుంటున్న వారికి తన రేంజ్ చూపించేలా సరిపోదా శనివారం తో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు నాని. ఈసారి మాస్ స్టఫ్ తో వస్తున్నాడు కాబట్టి నాని బాక్సాఫీస్ దగ్గర సందడి బాగానే చేసేలా ఉన్నాడు.