Nani : నాని దృష్టిలో పడ్డ స్టార్ కమెడియన్.. ఇద్దరు కలిసి సూపర్ ప్లాన్..!

న్యాచురల్ స్టార్ నాని (Nani) కేవలం హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తమ మార్క్ సినిమాలు చేస్తుంటాడు. అ! తో నిర్మాతగా మారిన నాని వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాలు చేస్తున్నాడు. అ! తర్వాత హిట్ 1, హిట్ 2 సినిమాలు

Published By: HashtagU Telugu Desk
Nani Shocking Comments on Eega 2

Nani Shocking Comments on Eega 2

న్యాచురల్ స్టార్ నాని (Nani) కేవలం హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తమ మార్క్ సినిమాలు చేస్తుంటాడు. అ! తో నిర్మాతగా మారిన నాని వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాలు చేస్తున్నాడు. అ! తర్వాత హిట్ 1, హిట్ 2 సినిమాలు నిర్మించిన నాని హిట్ 3 సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో టైం తీసుకుంటున్నాడు. ఇదిలాఉంటే నాని బ్యానర్ లో స్టార్ కమెడియన్ సినిమా ఉండబోతుందని లేటెస్ట్ టాక్.

కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ అటు లీడ్ రోల్ లో కూడా సత్తా చాటుతున్నాడు ప్రియదర్శి (Priyadarshi). పెళ్లిచూపులు సినిమాతో సూపర్ క్లిక్ అయిన దర్శి వరుస ఆఫర్లతో అదరగొడుతున్నాడు. తనకు ఇచ్చిన ప్రతి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు ప్రియదర్శి. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా ఇంప్రెస్ చేస్తున్నాడు. సేవ్ ది టైగర్స్ వెబ్ సీరీస్ లో గంటా రవి పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు ప్రియదర్శి.

కమెడియన్ గా చేస్తూ కూడా సోలో సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్నాడు. మల్లేశం, బలగం లాంటి కాన్సెప్ట్ సినిమాలతో తన రేంజ్ పెంచుకుంటున్నాడు ప్రియదర్శి. ఈమధ్యనే మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) డైరెక్షన్ లో ఒక సినిమా లాక్ చేసుకున్న ప్రియదర్శి నానితో కలిసి మరో సినిమా చేస్తాడని టాక్. నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.

Also Read : HCA President Tweet: నా స్టేడియంలోకి వ‌చ్చిన సీఎంకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్.. హెచ్‌సీఏ అధ్య‌క్షుడిని ఆడుకుంటున్న నెటిజన్లు..!

ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. హిట్ సీరీస్ లను పక్కన పెట్టి ప్రియదర్శితో నాని నెక్స్ట్ ప్రొడక్షన్ మొదలవుతుంది. నాని నిర్మాతగా ప్రియదర్శి హీరోగా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రియదర్శి సోలో సినిమా అంటే కచ్చితంగా మ్యాటర్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మరి ఈ కాంబో ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఆడియన్స్ కు అందిస్తారో చూడాలి.

తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తున్న ప్రియదర్శి వరుస అవకాశాలతో దుమ్ము దులిపేస్తున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రియదర్శి. రాబోయే సినిమాలతో అతను మరిన్ని ప్రయోగాలు చేస్తాడని చెప్పొచ్చు. నాని నిర్మాతగా సినిమా అనగానే ఆడియన్స్ లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని మాత్రం ఫిక్స్ అయ్యారు.

  Last Updated: 06 Apr 2024, 11:22 AM IST