Site icon HashtagU Telugu

Nani : నాని నిజంగా జాతిరత్నమే..!

Nani

Nani

న్యాచురల్ స్టార్ నాని (Nani) మిగతా హీరోలకంటే చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. కొత్త దర్శకులను పరిచయం చేయడంలో నాని తన మార్క్ చూపిస్తున్నాడు. మీడియం రేంజ్ హీరోల్లో ఎక్కువ హిట్ పర్సెంటేజ్ ఉన్న నాని దీనికి కారణం కొత్త వారికి అవకాశం ఇవ్వడమే అన్నట్టుగా చెబుతున్నాడు. ప్రతిభ ఉండి అవకాశం కోసం ఎదురుచూసే వారికి నేనున్నా అంటూ నాని నిలబడుతున్నాడు. అందుకే కొత్త దర్శకులతో అతను సూపర్ హిట్లు కొడుతున్నాడు.

ఆల్రెడీ ఈ ఇయర్ మొదట్లో శ్రీకాంత్ ఓదెల అనే టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన నాని. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఏడాది చివర్లో శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా చేసి హాయ్ నాన్నతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.

టాలీవుడ్ హిట్ మిషన్ గా నాని నిలుస్తున్నాడు. ముఖ్యంగా కొత్త దర్శకులతో నాని చేస్తున్న ఈ ప్రయత్నాలు పరిశ్రమకు మేలు చేస్తున్నాయి. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ నాని చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే నాని నిజమైన జాతిరత్నం అనేస్తున్నారు అతని ఫ్యాన్స్.

Also Read : Airplane Under Bridge : బ్రిడ్జి కింద విమానం జామ్.. ఎలా ?

We’re now on WhatsApp : Click to Join