Site icon HashtagU Telugu

Rajamouli: నేను తీయ‌బోయే మ‌హాభార‌తంలో నాని ఫిక్స్‌: రాజ‌మౌళి

Rajamouli

Rajamouli

Rajamouli: ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా గురించి ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న కీల‌క అప్డేట్ ఇచ్చారు. రాజమౌళి మహాభారతం సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారని, ఇది బహుశా 10 భాగాలుగా రూపొందే అవకాశం ఉందని గతంలో నివేదిక‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల పేర్లు అభిమానులు.. మీడియాలో చర్చకు వచ్చాయి. అయితే తాజాగా మ‌హాభారతం మూవీ గురించి రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

నాని న‌టించిన హిట్‌-3 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వ‌చ్చిన రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభారతం గురించి మౌనం వీడారు. ప్రీరిలీజ్ ఈవెంట్ యాంక‌ర్ సుమ అడిగిన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి స‌మాధాన‌మిస్తూ.. నా డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభారతం మూవీలో నాని ఖ‌చ్చితంగా ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రాజ‌మౌళి మ‌హాభారతం ఉంటుంద‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక‌పోతే నాని- శ్రీనిధి న‌టించిన ఈ హిట్-3 మూవీ మే 1న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Also Read: TTD Key Decisions: టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు!

ఇక‌పోతే నాని- రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉంది. నాని రాజమౌళి దర్శకత్వంలో “ఈగ” (2012) సినిమాలో హీరోగా నటించారు. “మజ్ను” (2016) సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. అలాగే నాని సినిమాల ఈవెంట్‌లకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న “హిట్-3” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి హాజరయ్యారు.

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో SSMB29 ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి లీక్‌లు కాకుండా రాజ‌మౌళి టీమ్ చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటుంది. అయినాస‌రే మూవీకి సంబంధించిన లీక్‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక‌పోతే మహాభారతం ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక నటీనటుల ఎంపిక లేదా కాస్టింగ్ వివరాలేమీ తెలియ‌దు.