Nani Hit 3 న్యాచురల్ స్టార్ నాని వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న లతో లాస్ట్ ఇయర్ సూపర్ సక్సెస్ లు అందుకున్న నాని రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని సరిపోదా శనివారం ఇలా రిలీజైందో లేదో మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 సినిమా వస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3 లో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
నాని (Nani,) హిట్ 3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్స్ ఎక్కువ అవుతున్నాయి. చిత్ర యూనిట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఎక్కడో ఒకచోట నుంచి ఈ లీక్స్ వస్తున్నాయి. నాని హిట్ 3 లో KGF భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటిస్తుంది. సైంధవ్ తో హిట్ టార్గెట్ మిస్ అయిన శైలేష్ తన సూపర్ హిట్ ఫ్రాంచైజ్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.
నాని హిట్ 3 లీక్స్ కు రీజన్స్..
నాని హిట్ 3 (Hit 3) లీక్స్ కు రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ సినిమా నుంచి ఈ లీక్స్ బజ్ పెంచేస్తున్నాయి. నాని నుంచి రాబోతున్న మరో క్రేజీ సినిమాగా హిట్ 3 వస్తుంది. ఈ లీక్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగేలా చేస్తుంది. KGF రెండు పార్ట్ లు వచ్చి రెండేళ్ల పైన అవుతుండగా ఇన్నాళ్లకు శ్రీనిధి తెలుగులో ఒకేసారి రెండు సినిమాలు చేస్తుంది.
నాని హిట్ 3 తో పాటుగా సిద్ధు జొన్నలగడ్డ తో తెలుసు కదా సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాలతో తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది శ్రీనిధి శెట్టి.