Nani Hi Nanna న్యాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి అలరించింది. ఎమోషనల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు మాత్రం ఘాటుగా ఉంటున్నాయి.
నాని మృణాల్ ఠాకూర్ లిప్ లాక్ సీన్స్ హాయ్ నాన్న టీజర్ లో సర్ ప్రైజ్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుంచి థర్డ్ సాంగ్ పోస్టర్ వదలగా అందులో కూడా నాని, మృణాల్ (Mrunal Thakur) రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తున్నారు.
Also Read : Tollywood : టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్.. బ్యాంక్ ఖాతాలో 70 పైసలా..?
ఎమోషనల్ కంటెంట్ అంటూ చెబుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా రిలీజ్ చేస్తున్నరు. సీతారామం తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఈ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. ఇక సినిమాలో హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ కూడా మేజర్ పాత్ర పోశిస్తుంది.
సినిమాలో నాని మరోసారి ఫాదర్ రోల్ లో కనిపిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్ కూడా ఉంటుందని తెలుస్తుండగా ఆమెను కేవలం థియేటర్ లోనే సర్ ప్రైజింగ్ గా రివీల్ చేస్తారని తెలుస్తుంది. డిసెంబర్ 7న రిలీజ్ లాక్ చేసిన నాని హాయ్ నాన్న సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ ఏడాది మొదట్లో దసరాతో సూపర్ హిట్ అందుకున్న నాని హాయ్ నాన్నతో అదరగొడతాడా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join