Site icon HashtagU Telugu

Nani : ఫ్యామిలీ స్టార్ పై నాని షాకింగ్ రియాక్షన్.. బ్రోకెన్ హర్ట్ సింబల్ తో.. ఇదంతా వాళ్ల పనే..!

Nani Heart Broken Comment for Vijay Devarakonda Family Star

Nani విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే రూపొందించారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా ఉంటుందని అనుకోగా రిలీజైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా పై నాని సెన్సేషనల్ కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది.

ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన నాని తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో ఫ్యామిలీ స్టార్ హార్ట్ బ్రేక్ సింబల్ ని పెట్టినట్టు ఒక వార్త వైరల్ గా మారింది. అయితే అది నాని అఫీషియల్ అచౌంట్ నుంచి పెట్టినట్టు అందరు భావించారు కానీ అది నాని ఫ్యాన్స్ ఎవరో కావాలని అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఒక సినిమా బాగుంది అంటే దాన్ని ప్రమోట్ చేసేందుకు హీరోలు ముందుకొస్తారు కానీ ఒక సినిమా నచ్చలేదని చెప్పే ప్రయత్నం ఎవరు చేయరు. విజయ్ దేవరకొండ సినిమాకు నాని హార్ట్ బ్రోకెన్ సింబల్ పెట్టడం జరగని పని.

నాని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. నాని నటించిన ఎవడే సుబ్రమణ్యంతో విజయ్ పాపులర్ అవ్వగా ఆ తర్వాత సోలో సినిమాలు చేస్తూ వచ్చాడు. నాని సినిమా టైం లో విజయ్ ఫ్యాన్స్, విజయ్ సినిమా టైం లో నాని ఫ్యాన్స్ ఇలా ఇద్దరు తమ సినిమా మీద బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

నాని, విజయ్ దేవరకొండ ఇద్దరు ఈ ఫ్యాన్ వార్ గురించి లైట్ తీసుకుంటున్నా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ఫైట్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు విజయ్ సినిమా ఫ్యామిలీ స్టార్ కు నాని హార్ట్ బ్రోకెన్ సింబల్ తో సినిమా బాగాలేదని కామెంట్ చేసినట్టుగా కొందరు వైరల్ చేస్తున్నారు. కానీ నాని అలా ఒకరి సినిమా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ లేదు. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ ను పరశురాం డైరెక్ట్ చేశారు.

విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచి డివైడ్ టాక్ వచ్చింది. పరశురాం విజయ్ గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ చేస్తారని భావించిన ఆడియన్స్ కు షాక్ తగిలినట్టే అయ్యింది.

Also Read : Prabhas Kalki : ప్రభాస్ సినిమా మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది..?

Exit mobile version