Nani : నేను అన్న మాటల్ని వక్రీకరించి రాశారు.. మరోసారి నేషనల్ అవార్డ్స్ పై స్పందించిన నాని..

మన తెలుగు సినిమాలకు బోలెడన్ని నేషనల్ అవార్డ్స్ (National Awards)వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నాని తమిళ సినిమా జై భీమ్(Jai Bhim) కి అవార్డు రాకపోవడంపై బాధపడుతూ పోస్ట్ పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Nani

Nani

న్యాచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే దసరా(Dasara) సినిమాతో భారీ విజయం సాధించగా త్వరలో హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో రాబోతున్నారు. ఇటీవల మన తెలుగు సినిమాలకు బోలెడన్ని నేషనల్ అవార్డ్స్ (National Awards)వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నాని తమిళ సినిమా జై భీమ్(Jai Bhim) కి అవార్డు రాకపోవడంపై బాధపడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో తెలుగు మీడియా, నెటిజన్లు నానిపై విమర్శలు చేశారు. మన సినిమాలకు వస్తే అభినందించాల్సింది పోయి పక్క రాష్ట్రం సినిమాలకు రాలేదని బాధపడుతున్నారా అంటూ ట్రోల్ చేశారు.

తాజాగా ఓ మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో నాని పాల్గొనగా ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. నాని మాట్లాడుతూ.. నేను నేషనల్ అవార్డ్స్ పై మాట్లాడిన దాన్ని చాలామంది తప్పుగా అర్ధం చేసుకొని వక్రీకరించి రాశారు. తెలుగు సినిమాకు చాలా అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ మొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించినందుకు అతన్ని కూడా అభినందించాను. కానీ నేను జై భీమ్ లాంటి మంచి సినిమాకు అవార్డులు రాలేదని పెడితే టాలీవుడ్ కి అవార్డులు వచ్చినందుకు సంతోషంగా లేరని, కోలీవుడ్ కి సపోర్ట్ చేస్తున్నారని వార్తలు రాశారు. చాలా మంది అలాగే అన్నారు. నాకు జై భీమ్ చాలా నచ్చింది. ఆ సంవత్సరం వచ్చిన సినిమాల్లో అది కూడా బెస్ట్ మూవీ. అందుకే అవార్డు రాలేదని బాధపడ్డాను. అలాంటి వాటికి అవార్డులు వస్తే చిత్ర నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేస్తారు అని అన్నారు.

నేషనల్ అవార్డ్స్ లో జై భీమ్ కి అవార్డు రాకపోవడంపై తాను పెట్టిన పోస్ట్ ని సమర్థిస్తూ మాట్లాడటంతో మరోసారి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Also Read : Samantha : భూటాన్ లో సమంత ఆయుర్వేదం చికిత్స.. ఆరోగ్యం, ప్రశాంతత కోసం..

  Last Updated: 09 Nov 2023, 06:10 AM IST