Nani : నాని.. ఇప్పుడు టాలీవుడ్లో, సినిమా సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్న పేరు. హీరోగా వరుస విజయాలు, నిర్మాతగా మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తూ సక్సెస్ ఫుల్ పర్సన్ గా దూసుకొస్తున్నాడు. త్వరలో నాని హిట్ 3 సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల నాని నిర్మాణంలో తెరకెక్కిన కోర్ట్ అనే చిన్న సినిమా పెద్ద హిట్ అయినా సంగతి తెలిసిందే. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
అయితే సినిమాలు ఇలా హిట్ అయితే దర్శకులకు హీరోలు లేదా నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఆనవాయితి అన్ని పరిశ్రమలలో ఎప్పట్నుంచో ఉంది. గతంలో అనేకమంది హీరోలు, నిర్మాతలు వాళ్ళ దర్శకులకు కార్లు లేదా వాచ్ లు లేదా బ్రాస్ లైట్ లు.. గిఫ్ట్ గా ఇచ్చిన వాళ్ళే. ఈ క్రమంలో నాని కూడా కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ కి ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చాడట.
రామ్ జగదీశ్ ఎక్కడా నాని కార్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఫోటోలు షేర్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. నాని చేతుల మీదుగా కార్ గిఫ్ట్ గా అందుకోవడం మరో అఛీవ్మెంట్. గిఫ్ట్ ఇచ్చినట్టు బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదు. అందుకే ఎవరికీ చెప్పలేదు, సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు బయటపెట్టలేదు. నానికి ఇష్టం లేదనే ఆగాను. లేకపోతే నాని నాకు కార్ గిఫ్ట్ ఇచ్చాడని అరిచి మరీ చెప్పేవాడిని అని అన్నాడు. దీంతో మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు నానిని అభినందిస్తున్నారు.
Also Read : Parasuram : తెలుగు హీరో నో చెప్పడంతో.. కార్తీతో తెలుగు డైరెక్టర్ సినిమా..?