Site icon HashtagU Telugu

Nani – Hit 3 : హిట్ 3 కోసం పెన్ పడుతున్న నాని.. రానా విలన్‌గా..

Nani, Hit3, Rana Daggubati

Nani, Hit3, Rana Daggubati

Nani – Hit 3 : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తరువాత నాని లైనప్ లో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సినిమా, శైలేష్ కొలనుతో హిట్ 3 ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకుంది. ఇక ఆ క్రేజ్ తగ్గట్లే ఆ సినిమా మేకింగ్ కి కూడా సిద్ధం చేస్తున్నాడు నాని. తాజాగా హిట్ 3 గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ గా మారింది.

దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నాని.. అనుకోకుండా హీరోగా మారాడు. అయితే భవిషత్తులో కుదిరితే దర్శకుడిగా మారతాను అంటూ నాని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే దర్శకుడిగా కాకుండా, రైటర్ గా భాద్యతలు తీసుకోబోతున్నారట. హిట్ 3 కోసం నాని పెన్ పట్టుకొని కథని రాయబోతున్నారట. హిట్ 3 కోసం నాని ఓ స్టోరీ లైన్ అనుకున్నారట. ఇప్పుడు ఆ స్టోరీ లైన్ శైలేష్ కొలను డెవలప్ చేసే పనుల్లో ఉన్నారట.

నాని అనుకున్న ఈ స్టోరీ లైన్ లో ఓ భయంకరమైన విలన్ ఉన్నాడట. ఇక ఆ విలన్ గా రానాని అనుకుంటున్నారట నాని. టాలీవుడ్ లో నాని అండ్ రానా మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. రానా తనని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడని నాని ఎప్పుడు చెప్పుకొస్తుంటారు. ఇప్పుడు అదే స్నేహంతోనే నానికి విలన్ గా చేసేందుకు కూడా రానా సై అనే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Exit mobile version