Nani Crying Sentiment న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న అంటూ డిసెంబర్ మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శృతి హాసన్ కూడా సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.
అంతేకాదు సినిమాలో నాని, మృణాల్ ల మధ్య లవ్ సీన్స్ కూడా అలరిస్తాయని టాక్. అయితే నాని సినిమాలో అతను ఏడిస్తె మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. నాని ఇదివరకు హిట్ కొట్టిన చాలా సినిమాల్లో నాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే సినిమాలో నాని కంట నీరు పెట్టుకున్నాడు.
సినిమా ట్రైలర్ లోనే నాని ఎమోషనల్ టచ్ ఆడియన్స్ ని టచ్ చేసింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక హై ఎమోషనల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. సినిమా ప్రమోషన్స్ లో నాని ఈ సినిమాలో తాను చాలా అందంగా కనిపిస్తున్నానని అన్నాడు. నాని ఇలా తనని తాను పొగుడుకోవడం చూస్తుంటే సినిమా మీద అతనికి ఉన్న కాన్ ఫిడెంట్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.
Also Read : Rashmika : రష్మికకు యాక్టింగ్ రాదు.. నేషనల్ క్రష్ పై KRK కామెంట్స్..!
We’re now on WhatsApp : Click to Join