Nani సీతారామం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో హీరోయిన్స్ కొరత ఉన్న కారణంగా ఏ హీరోయిన్ వచ్చినా ఆమెలో ఏ కొంత టాలెంట్ ఉన్నా సరే ఆమెను సూపర్ గా ఎంకరేజ్ చేస్తారు. ఈ క్రమంలో మృణాల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని తో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన మృణాల్ మెగా 156లో కూడా డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది.
నాని హాయ్ (Hi Nanna) నాన్న డిసెంబర్ 7న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో మృణాల్ (Mrunal Thakur) గురించి ఒక క్రేజీ కామెంట్ చేశాడు నాని. మృణాల్ లో ఏదో తెలియని ఒక ఎక్స్ పాయింట్ ఉంటుంది. స్క్రీ మీద తను మ్యాజిక్ చేస్తుంది. కెమెరా వెనక ఆమె ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం ఆమె చెలరేగిపోతుందని అంటున్నాడు నాని.
హాయ్ నాన్న సినిమాలో మృణాల్ తో లిప్ లాక్స్ కూడా చేశాడు నాని. సినిమా కథకు అవసరం కాబట్టే అవి ఉన్నాయని అన్నారు. ఈ ఇయర్ దసరా (Dasara)తో సూపర్ హిట్ అందుకున్న నాని హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. మరి నాని మార్క్ మూవీగా హాయ్ నాన్న ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Raviteja : సంక్రాంతికి ఈగల్ కష్టమేనా.. ఆ సినిమా కూడా..?
We’re now on WhatsApp : Click to Join