Nani Fans Meet: నాని క్రేజ్ మాములుగా లేదుగా.. సెల్ఫీల కోసం ఫ్యాన్స్ క్యూ!

తన సహజ నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ను (Fans) అకట్టుకున్నాడు నాని.

Published By: HashtagU Telugu Desk
Nani

Nani

ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో నాచురల్ స్టార్ నాని (Hero Nani) బిగ్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోడు. టాలీవుడ్ అగ్ర హీరోలా మాదిరిగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయకపోయినప్పటికీ, కథా బలమున్నా సినిమాల్లో నటిస్తూ నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే టాక్ అటు ప్రేక్షకుల్లో, ఇటు నిర్మాతల్లోనూ ఉంది. తన సహజ నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ను (Fans) అకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 30న విడుదల కానున్న దసరా (Dasara) సినిమాతో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినీ ప్రియులను అలరించబోతున్నాడు.

ఈ సినిమా విడుదలకు ముందు నాని (Hero Nani) తన అభిమానులను కలుసుకుని తనతో సెల్ఫీలు దిగే అవకాశాన్ని కల్పించాడు. దసరా నటుడితో ఫోటోలు దిగేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల నుండి నాని అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక హీరో నాని ఓపికగా వారితో ఫొటోలు దిగి ముద్దుగా నవ్వుతూ పలకరించారు. అభిమానులను తీసుకొచ్చిన గిఫ్ట్ చూసి మురిపోయాడు. అంతేకాకుండా, అతని లుక్స్ కూడా అందర్నీ ఆకర్షించాయి. దసరా సినిమాలో నాని(Hero Nani), కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

Also Read : Chiranjeevi Dinner Party: చిరు డిన్నర్ పార్టీ.. ‘వీరయ్య’ విజయం అందించేనా!

 

  Last Updated: 03 Jan 2023, 04:04 PM IST