Nani : బాలీవుడ్ లో సెలబ్రిటీలు, హీరోలు, నటీనటులు వీకెండ్స్, స్పెషల్ డేస్ వస్తే ఓపెన్ గానే పార్టీలు చేసుకుంటారు, మందు తాగుతారు. అక్కడ పార్టీ కల్చర్ ఎక్కువే. ఆ పార్టీ ఫోటోలు కూడా బయటకు రిలీజ్ చేస్తారు. కానీ టాలీవుడ్ లో అంత బహిరంగ పార్టీలు అయితే ఇంకా రాలేదు. అయితే టాలీవుడ్ లో జరిగే పార్టీల గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నాని ఇటీవలే హిట్ 3 సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ వసూలు చేసి 100 కోట్లకు దూసుకెళ్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ పార్టీల గురించి నానిని ప్రశ్నించారు.
దీనిపై నాని స్పందిస్తూ.. టాలీవుడ్ లో కూడా పార్టీలు ఉంటాయి కానీ బయటకు కనిపించవు. బాలీవుడ్ లాగా వీకెండ్ పార్టీలు అయితే ఉండవు. ఎప్పుడన్నా స్పెషల్ డేస్, సినిమా హిట్ అవ్వడాలు, బర్త్ డే, యానివర్సరీ లాంటివి జరిగినప్పుడు పార్టీలు చేసుకుంటాము. మేము చేసుకునే పార్టీలు బయటకు చూపించాలి అనుకోము. చాలా వరకు మా ఇళ్లల్లోనే పార్టీలు జరుగుతాయి, బయటకు వెళ్ళము. పార్టీలో డ్రింక్ చేస్తాము, డిన్నర్ చేస్తాము. అప్పుడు నటీనటులు అంతా కలుస్తాము. టాలీవుడ్ కూడా పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది కాబట్టి భవిష్యత్తులో బాలీవుడ్ లాగా పార్టీ కల్చర్ వస్తుందేమో అని అన్నాడు.
దీంతో నాని కామెంట్స్ వైరల్ అవ్వగా టాలీవుడ్ లో జరిగే పార్టీల ఫోటోలు కూడా బయటకు వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also Read : Samantha : వైజాగ్ సమంత హిట్ సినిమాలకు అడ్డా.. చాన్నాళ్లకు సినిమా ఈవెంట్లో సమంత..