Nani: నిర్మాతలకు నాని కౌంటర్… తన సినిమా కోసం ఏడు తేదీలు బ్లాక్ చేసిన నేచురల్ స్టార్..!!

నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 09:56 AM IST

నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాం లోనూ ఈ సినిమా వరల్డ్ లోనే థర్డ్ ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ‘శ్యామ్ సింగరాయ్’ ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న నాని… వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు నాని. లేటెస్ట్ గా రిలీజ్ కి రెడీ గా ఉన్న మూవీలకు సంబంధించి చూస్తే… ఆయా నిర్మాతలు రెండేసి విడుదల తేదీలను బ్లాక్ చేసి పెడుతున్నారు.

దీంతో నాని కూడా వారికి కౌంటర్ ఇచ్చినట్లుగా సమ్మర్ మొత్తానికి గాను, తన మూవీ రిలీజ్ కోసం ఏకంగా 7 తేదీలను బ్లాక్ చేసేశాడు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా..? అదేనండీ… నేచురల్ స్టార్ హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరానికి!’ సినిమా కోసం. ఏప్రిల్‌ 22,29, మే 6,20,27, జూన్‌ 3,10 ఇలా ఏడు తేదీలను బ్లాక్‌ చేసి పెట్టారు. ‘మీరంతా రెండురెండు తేదీలు బ్లాక్‌ చేస్తే… మేము ఏడు తేదీలు బ్లాక్‌ చేయకూడదా…? ఫుల్‌ ఆవకాయ సీజన్‌ బ్లాక్‌ చేశాం. మెల్లగా డిసైడ్‌ చేస్తాం’’అని నాని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నాని చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారింది. నాని సరసన నజ్రియా నజీమ్‌ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుని నాని హిట్ కొడతాడో లేదో చూడాలి.

Nani As