Site icon HashtagU Telugu

Nani: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న నాని.. ఒకేసారి రెండు సినిమాలు.?

Mixcollage 25 Feb 2024 10 22 Am 2677

Mixcollage 25 Feb 2024 10 22 Am 2677

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే. నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నాని. గత ఏడాది దసరా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న దాన్ని ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇప్పుడు ఇదే జోరు మీద మరి కొన్ని సినిమాలను లైనప్ చేశారు నాని. అయితే తాజాగా నాని పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. గతంలో ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికి అనే సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో సారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈసారి పక్క ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిన్న నాని పుట్టిన రోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు నాని.

సుజిత్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నారు. ప్రభాస్ సాహో సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నానితో సినిమా చేయనున్నాడు. అలా సినిమాల విషయంలో నాని తగ్గేదేలే అంటూ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలా మొత్తానికి ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు నాని.

Exit mobile version