Site icon HashtagU Telugu

Dasara Trailer: నాని మాస్ అవతార్.. దసరా ట్రైలర్ మాములుగా లేదు!

Dasara

Dasara

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన లేటెస్ట్ మూవీ `దసరా`. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వం వహించారు. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఊరమాస్‌ లుక్‌లో సాగే ట్రైలర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. నాని నెవర్‌ బిఫోర్‌ అనేలా ఈ ట్రైలర్‌ సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్‌ అంశాలతో ఈ ట్రైలర్‌ సాగుతుంది. నాని ఇందులో ధరణిగా పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ ట్రైలర్‌ సాగుతుంది.

ఆయన నటన సినిమాకి హైలైట్‌గా నిలవబోతుంది. ఇక ఇందులోని తెలంగాణ యాసలో సాగే డైలాగ్‌లు ఆదిరిపోయేలా ఉన్నాయి. కాకపోతే అంతటి పవర్‌ఫుల్‌గా అనిపించకపోవడంతో ఏదో అసంతృప్టి అనిపిస్తుంది. ఏదైతే అదైంది బాంచెత్‌ అని మరోసారి ఇందులో వాడారు నాని. మరోవైపు కొన్ని పదాలన పచ్చిగా వాడారు. ఇక ట్రైలర్ `చిత్తు చిత్తులా గుమ్మ` అంటూ తెలంగాణ జానపద బతకమ్మ పాటతో ప్రారంభం కావడం విశేషం. కీర్తిసురేష్‌ మొదట పెళ్లికూతురిగా కనిపించింది. ఆ తర్వాత ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సీన్స్ లో దుమ్మురేపాడు నాని. విరోచితంగా విశ్వరూపం చూపించారు. మరోవైపు తెలంగాణ డైలాగ్‌లతో ఆదరగొట్టాడు. ఈ క్రమంలో ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్‌ రాల్తయ్‌.. బ్యాంచెత్‌ `అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

Exit mobile version