Site icon HashtagU Telugu

Nani : శ్రీరామనవమికి ‘దసరా’ బ్లాక్ బస్టర్.. ఈసారి క్రిస్మస్ ని టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్..

Nani 30 Movie releasing on December 21st

Nani 30 Movie releasing on December 21st

న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే శ్రీరామనవమికి దసరా సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. సినిమా మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది దసరా. దసరా సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దసరా విజయంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

తాజాగా నాని నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌరి దర్శకత్వంలో నాని 30వ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఓపెనింగ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దసరాలో మాస్, రా అండ్ రస్టిక్ అంశాలతో ఆకట్టుకున్న నాని ఈ సారి ఫ్యామిలీ స్టోరీతో రాబోతున్నాడు. నాని 30వ సినిమా తండ్రి కూతుళ్ళ అనుబంధం మధ్య ఉండబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా నాని 30వ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలుపెట్టగా ఇప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నాని 30వ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. దీంతో నాని అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దసరాతో మాస్ రోల్ లో మెప్పించిన నాని వెంటనే చాలా చేంజ్ తో ఫాదర్ క్యారెక్టర్ లో ఫ్యామిలీ సినిమాతో వస్తున్నాడు. గతంలో నాని ఫాదర్ క్యారెక్టర్ చేసిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఫాదర్ క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని అంటున్నారు అభిమానులు.

 

Also Read :    Pawan Kalyan : షూటింగ్ మొదలుపెట్టిన OG.. ఈ వీడియో చూశారా?? పవన్ ఫాన్స్ కు పూనకాలే..