Site icon HashtagU Telugu

Nani : నానితో 100 కోట్ల సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Nani

Nani

న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram) రిలీజ్ అయ్యేలోగా తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఒకటి లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో మరోసారి నాని తన మాస్ స్టామినా చూపిస్తాడని టాక్. నాని శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి ఆడియన్స్ కు మరో దసరా లాంటి మూవీ అందించాలని చూస్తున్నారు.

ఈ సినిమాకు బడ్జెట్ గా 100 కోట్లు పెట్టేస్తున్నారని టాక్. దసరా సినిమాకే 60 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. అప్పటివరకు నాని (Nani) కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ అదే. 100 కోట్ల బడ్జెట్ తో నాని సినిమా అంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ఇదేకాకుండా నాని సుజిత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది.

నాని సుజిత్ (Sujith) కాంబోలో సినిమాను కూడా నిర్మాత డివివి దానయ్య (DVV Danaiah) హై బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. నాని సరిపోదా శనివారం ఆగష్టు 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న నానికి ఈ సినిమా కూడా మరో సూపర్ హిట్ సినిమా అయ్యేలా ఉందని అనిపిస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల మూవీ మాత్రం త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందని తెలుస్తుంది. నాని మరో డిఫరెంట్ రోల్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో నాని తన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ కూడా నాని నుంచి రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ అవుతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Sai Dharam Tej : ఆ హీరోయిన్ తో సాయి తేజ్ పెళ్లి..?

Exit mobile version