Nani : సరిపోదా కాదు సరిపోయింది అనిపించేలా..!

Nani న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్

Published By: HashtagU Telugu Desk
Nani Saripoda Shanivaram Movie update

Nani Saripoda Shanivaram Movie update

Nani న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమధ్య వచ్చిన టీజర్ చూస్తే ఎంత కోపం వచ్చినా కేవలం శనివారం మాత్రమే విలన్ల బడతం పట్టే హీరో పాత్రలో నాని కనిపిస్తున్నాడు. అంటే సుందరానికీ తర్వాత నాని, వివేక్ కలిసి చేస్తున్న సినిమాగా సరిపోదా శనివారం సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాతో మరోసారి నాని యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఆల్రెడీ దసరాతో ఊర మాస్ యాంగిల్ చూపించి అదరగొట్టిన నాని సరిపోదా శనివారం లో అటు తన క్లాస్ ఫ్యాన్స్ ని మెప్పిస్తూ ఇటు మాస్ ఆడియన్స్ ని కూడా కన్విన్స్ చేసేలా ఉంటాడట. మొత్తానికి నాని సరిపోదా శనివారం కాస్త మాస్ ఆడియన్స్ కు సరిపోయింది అనిపించేలా ఉంటుందని టాక్.

ఈ సినిమాను ఆగష్టు 27న రిలీజ్ లాక్ చేశారు. సోలో రిలీజ్ డేట్ కాబట్టి కాస్త బాగున్నా నాని ఖాతాలో మరో సూపర్ హిట్ పడే ఛాన్స్ ఉంటుంది. నాని వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న ఈ రెండో అటెంప్ట్ ఆడియన్స్ కు ఎలాటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో చూడాలి.

  Last Updated: 04 Jul 2024, 11:33 PM IST