Site icon HashtagU Telugu

Nandita Swetha : హీరోయిన్ నందిత శ్వేత ఆ వ్యాధితో బాధపడుతుందట.. పాపం.. అయినా సినిమా కోసం..

Nandita Swetha effected with Health Issues even work hard for Movie

Nandita Swetha effected with Health Issues even work hard for Movie

తమిళ్ సినిమాలతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ నందిత శ్వేత(Nandita Swetha). వరుసగా తమిళ్ లో సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో నిఖిల్(Nikhil) హీరోగా చేసిన ఎక్కడికి పోతావురా చిన్నవాడా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు తెలుగు స్పీమాలతో మెప్పించింది నందిత. ప్రస్తుతం అశ్విన్ బాబు(Ashwin Babu)తో కలిసి హిడింబ(Hidimba) సినిమాతో రాబోతుంది. జులై 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రస్తుతం హిడింబ చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్ నందిత శ్వేత తన హెల్త్ కి సంబంధించి ఓ విషయాన్ని తెలిపింది.

నందిత శ్వేత మాట్లాడుతూ.. హిడింబ సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఇందులో పోలీసాఫీసర్ గా కనిపిస్తాను. చాలా వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. కానీ నేను గత కొన్నేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా(Fibromyalgia) అనే కండరాల రుగ్మతతో బాధపడుతున్నాను. దీని వల్ల భారీ వ్యాయామాలు చేయలేను. దీనికి ప్రత్యేకంగా డైట్ పాటిస్తున్నాను. కానీ ఈ సినిమా కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించినా సినిమా కోసం తప్పలేదు. ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఈ బాధ మరింత ఎక్కువవుతుంది అని తెలిపింది.

 

Also Read : Samantha Spiritual: సినిమాలకు గుడ్ బై.. ఆధ్యాత్మిక యాత్రలకు సై!