Site icon HashtagU Telugu

Nandi Awards : ‘నంది అవార్డు’ పేరుని అధికారం లేకుండా వాడుకుంటున్నారు.. తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డుల గోల..

Nandi Awards issue in Tollywood Telugu Film Chamber of Commerce issue Letter

Nandi Awards issue in Tollywood Telugu Film Chamber of Commerce issue Letter

సినీపరిశ్రమలో ప్రతి సంవత్సరం బెస్ట్ సినిమాలకు, నటీనటులకు, టెక్నీషియన్స్ కు నంది అవార్డు(Nandi Award)ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఏపీ(AP) రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రెండేళ్లు ఇచ్చి ఆ తర్వాత నుంచి నంది అవార్డ్స్ ఇవ్వడం ఆపేశారు. నంది అవార్డులని రెండు ప్రభత్వాలు పట్టించుకోవడం మానేశాయి. సినీ పరిశ్రమ ప్రముఖులు, పెద్దలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయి నంది అవార్డులు ఇవ్వాలని కోరినా వాటి గురించి తెలుగు ప్రభుత్వాలు ఆలోంచట్లేదు.

దీంతో గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమలో నంది అవార్డుల గురించి ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ వస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ సంస్థ అయిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC నంది అవార్డ్స్ ఇస్తానని ప్రకటించి, ఆ కార్యక్రమాన్ని దుబాయ్ లో భారీగా చేయనున్నట్టు తెలిపాడు. సెప్టెంబర్ 24న దుబాయ్ లో TFCC నంది అవార్డ్స్ ఇస్తారని ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. అయితే ఇవి ప్రభుత్వం ఇవ్వట్లేదు. దీంతో ఈ అవార్డులపై తెలుగు పరిశ్రమలో వివాదం నెలకొంది.

నంది అవార్డు పేరుతో ప్రతాని రామకృష్ణ గౌడ్ అవార్డులు ఇవ్వడంపై ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూ అధికారికంగా ఓ లెటర్ ని కూడా రిలీజ్ చేశాయి.

ఈ లెటర్ లో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది తెలుగు పరిశ్రమకు తల్లి లాంటింది. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కలిసి ఈ ప్రకటన చేస్తున్నాము. ఈ రెండు మాత్రమే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలు. ఇటీవల దుబాయ్ లో నంది అవార్డ్స్ ఈవెంట్ చేస్తామని TFCC సంస్థ ప్రకటించింది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ఈవెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో తెలుగు, తెలంగాణ ఫిలిం చాంబర్స్ భాగం అవ్వట్లేదు. నంది అవార్డు అనే పదం ప్రభుత్వానికి పేటెంట్ ఉంది. దాన్ని ప్రైవేట్ సంస్థలు వాడుకోవటానికి వీల్లేదు. ఈ ఈవెంట్ గురించి రెండు ప్రభుత్వాల సినిమాటోగ్రఫీ మంత్రులని కనుక్కున్నాం. అధికారికంగా రెండు ప్రభుత్వాలకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సమాచారం అందరికి తెలియడానికి ఈ లెటర్ ని విడుదల చేస్తున్నాం అని తెలిపారు. దీంతో తెలుగు పరిశ్రమలో నంది అవార్డుల వివాదం నెలకొంది.

 

Also Read : Samantha : మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్ల ఖర్చు.. కౌంటర్ ఇచ్చిన సమంత..