Site icon HashtagU Telugu

Aditya 999: నందమూరి మోక్షజ్ఞా మూడో సినిమా ఫిక్స్… అయితే బాలయ్య డైరెక్షన్ లో?

Aditya 999

Aditya 999

నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లో ఒక ముఖ్యమైన బ్లాక్‌బస్టర్ మూవీ “ఆదిత్య 369”. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. “ఆదిత్య 369” సీక్వెల్‌ కోసం నందమూరి అభిమానులు మరియు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.

ఈ సీక్వెల్‌గా “ఆదిత్య 999” వస్తుందని బాలకృష్ణ ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటించారు. తాజాగా, ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో “అన్‌స్టాపబుల్ సీజన్ 4″లో సీక్వెల్‌ గురించి మరిన్ని వివరాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఎపిసోడ్ ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీ లీల, నవీన్ పోలిశెట్టి గెస్టులుగా వచ్చారు. అయితే మనకు ఆహ వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి.

“ఆదిత్య 999 చిత్రానికి సీక్వెల్‌గా వచ్చే చిత్రం, మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘ఆదిత్య 999’ షూటింగ్ మొదలవుతుంది” అని బాలకృష్ణ తెలిపారు. ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది, అప్పుడు మరిన్ని వివరాలు పంచుకుంటానని బాలయ్య పేర్కొన్నారు.

మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా, ప్రశాంత్ వర్మ సైనమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ డ్యాన్స్, యాక్షన్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆ తర్వాత వెంకీ అట్లూరి తో రెండో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత “ఆదిత్య 999″లో మోక్షజ్ఞ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

“ఆదిత్య 369” టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ఇందులో హీరో భూతకాలం మరియు భవిష్యత్‌లోకి ప్రయాణిస్తాడు, అతను ఎదుర్కొనే పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ చిత్రం బాలకృష్ణ యొక్క సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.