మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో నందమూరి నటసింహాం బాలయ్య కూడా తన కొడుకు ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మోక్షజ్ఞ ఎంట్రీకి రూట్ క్లియరయ్యేలా ఉంది. ఇప్పటికే బాగా సన్నబడిన లుక్స్ తో బాలయ్య ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
ప్రస్తుతం బాలయ్య కుమారుడి తెరంగేట్రం ఎప్పుడనే దాని మీదే అందరి చూపూ ఉంది. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు. తాత ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలోనే టాలీవుడ్ కు పరిచయం చేసే యోచనలో బాలయ్య బలంగా ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే యాక్టింగ్, డాన్సులకు సంబందించిన శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞకు బ్యానర్ సమస్య లేదు.
నాన్న బాలయ్య లేదా ఎవరికి ఎస్ చెప్పినా అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. గతంలో వారాహి సాయి కొర్రపాటి రానే వచ్చాడు మా రామయ్య టైటిల్ ని రిజిస్టర్ చేయించి మరీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత తనకు సినిమాల పట్ల ఆసక్తి ఉందో లేదోననే ప్రచారాలు కూడా జరిగాయి. అయితే మొత్తానికి దారి సుగమం చేసుకుని సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారట. చరణ్ ని లాంచ్ చేసిన పూరి జగన్నాధ్ టాప్ ఆప్షన్లలో ఉన్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఇంకో రెండు మూడు నెలలు ఆగాల్సిందే.
Also Read: Megastar Chiranjeevi: ‘ముల్లోక వీరుడు’గా మెగాస్టార్, ఎనిమిది హీరోయిన్స్ తో చిరు రొమాన్స్?